ఎండ సెగకు తగులబడ్డ ట్రాక్టర్.. తప్పిన పెను ప్రమాదం
డ్రైవర్ చాకచక్యం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వైనం నవగీతం,కొడిమ్యాల ప్రతినిది: కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. భానుడి భగభగలకు వేడెక్కిన ఓ ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఘటన వివరాల్లోకి వెళ్తే..నమిలకొండ గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ మట్టి ఇటుకల (బ్రిక్స్) లోడ్‌తో వెళ్తోంది. నల్లగొండ గ్రామ సమీపానికి చేరుకోగానే, ఎండ తీవ్రత కారణంగా ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి.అప్రమత్తమైన డ్రైవర్..మంటలను గమనించిన డ్రైవర్ ఏమాత్రం తడబడకుండా సమయస్ఫూర్తితో...