navageetam.com
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 12:00 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల పై మండల కాంగ్రెస్ శ్రేణుల నిరసన

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

మొన్న పార్లమెంటులో బిజెపి ఎంపీ తేజ స్వి సూర్య తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం అమరవీరుల త్యాగాలను .. అపహాస్యం చేయడమేనని, తెలంగాణను అవ‌మానిస్తుంటే సిగ్గులేకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు సమర్ధిస్తున్నారు అని ,రాజ్యాంగ ప్ర‌క్రియ ప్ర‌కారం జ‌రిగిన‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మీ పార్టీనేత‌ తేజ‌స్వీ సూర్య విషం క‌క్కితే మద్దతు తెలపడం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని, ప్ర‌జాస్వామ్యాన్ని అపహాస్యం  చేస్తూ దేశంలో ప్రజల మధ్య  వైష‌మ్యాల‌ను సృష్టిస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.డిలిమిటేషన్ బిల్లు అని నేరుగా తీసుకొస్తే దేశం మొత్తం వ్యతిరేకిస్తుందని తెలిసి మహిళా రిజర్వేషన్ అనే  ముసుగు వేసిందని, మహిళా సాధికారిత కోసం తీసుకురావలసిన కీలక బిల్లు పై ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తుందని,మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు.దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత మంది మహిళా ముఖ్యమంత్రులను చేసిందని ఎద్దేవా చేశారు.మహిళల హక్కులు,సమాన అవకాశాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ఇన్ని సంవత్సరాలు జనాభా నియంత్రణలో ఉన్న దక్షిణ రాష్ట్రాలకు వేసిన శిక్ష అని దేశం పేరు మీద మోసం మహిళల పేరు మీద రాజకీయాల ఆట కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని వేసిన ప్రణాళిక అని  విమర్శించారు.ఈ కార్యక్రమంలో .. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుగ్గిల రమేష్, విలయతాబాద్ సర్పంచ్ వేముల లింబాద్రి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదరి లాజర్, ఉప సర్పంచ్ గడ్డం జలంధర్ రెడ్డి ,సీనియర్ నాయకులు ఉరుమడ్ల నర్సయ్య , తదితరులు పాల్గొన్నారు..