navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 4:50 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి;

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట్ గ్రామంలో ఎరువుల దుకాణాలను జిల్లా మరియు డివిజనల్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు రాజుల నాయుడు దండ రమేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపాస్ మెషిన్ ఎరువుల నిల్వలు, రికార్డులు, బిల్లులు తదితరాలను పరిశీలించారు. యాజమాన్యాలు యూరియాను వ్యవసాయేతర పనులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య ఉన్నారు.