navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 6:39 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కథలాపూర్ లో బిజెపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

కథలాపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల బీజేపీ ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఏకాత్మ మానవ వాదం,అంత్యోదయ అకుంఠిత ధీక్ష,అంకిత భావానికి ప్రతిరూపమై క్రమశిక్షణ కల్గిన పార్టీయని తెలిపారు.దేశ సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే కార్యకర్తల బలం బీజేపీ ముందుకు సాగుతున్నదన్నారు.వాజపేయి నాయకత్వాన, అద్వానీ సహకారంతో ఎందరో నాయకుల శ్రమతో పార్టీ ఎదిగిందన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ దేశంలో ముందుకు సాగుతున్నదన్నారు. భారత దేశ సమున్నత అభివృద్దే లక్ష్యం గా జాతీయ వాద భావననే స్ఫూర్తి గా బీజేపీ ఆవిర్భావం చెందినదన్నారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు బూత్ స్థాయి నుండి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, గాంధారి శ్రీనివాస్, బండ అంజయ్య,ఆనందం రెడ్డి, కాసోజిప్రతాప్,సునీల్,సత్యం, రవీందర్ రెడ్డి, ప్రసాద్,భూమయ్య, మహేష్, సత్యనారాయణ, అశోక్, నారాయణ, సత్యం,శివ,రాజం బీజేపీ నాయకులు పాల్గొన్నారు.