కథలాపూర్ లో బిజెపి ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కథలాపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల బీజేపీ ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఏకాత్మ మానవ వాదం,అంత్యోదయ అకుంఠిత ధీక్ష,అంకిత భావానికి ప్రతిరూపమై క్రమశిక్షణ కల్గిన పార్టీయని తెలిపారు.దేశ సంక్షేమం కోసం అనునిత్యం పరితపించే కార్యకర్తల బలం బీజేపీ ముందుకు సాగుతున్నదన్నారు.వాజపేయి నాయకత్వాన, అద్వానీ సహకారంతో ఎందరో నాయకుల శ్రమతో పార్టీ ఎదిగిందన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో...