navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 9:51 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయండి.

నవగీతం జగిత్యాల ప్రతినిధి

మెట్ పల్లి పట్టణంలోని వి ఆర్ యం గార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈనెల 20వ తేదీన జగిత్యాల లో జరగబోయే కేసీఆర్ బహిరంగ సభను అత్యంత విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీ రమణ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సభను ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించే వేదికగా మార్చాలని తెలిపారు.ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరబోతున్నారని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వాటి ప్రయోజనాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.

అలాగే, ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేయాలని, యువతను పెద్ద ఎత్తున సభకు తీసుకురావాలని నాయకులు కోరారు. సభ విజయవంతం కోసం మండల, గ్రామ స్థాయి నాయకులు సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని తెలిపారు.కార్యకర్తలంతా ఐక్యతతో కృషి చేసి సభను ఘన విజయంగా నిలపాలని, కార్యక్రమం నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నాయకులు సూచించారు.సభను చారిత్రాత్మక విజయంగా నిలిపి పార్టీకి మరింత బలం చేకూర్చాలని ఆకాంక్షించారు.