navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 5:31 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు అంజన్నను దర్శించిన మధుసూదనాచారి

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజన్న సన్నిధికి చేరుకున్న ఆయనను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, పూర్ణకుంభంతో ఆహ్వానించారు.స్వామివారి కటాక్షం కోసం మధుసూదనాచారి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం అంతా భక్తి మయంగా మారింది. వేదోక్త మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆయన వినమ్రంగా నమస్కరించి స్వామివారి కృప కోరుకున్నారు.అనంతరం దేవస్థాన ఈ.ఓ ఎస్. అంజనారెడ్డి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలతో పాటు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.