నవగీతం ,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని శనివారం సినీనటి అనన్య నాగళ్ల దర్శించుకున్నారు. ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమెతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ…కొండగట్టు అంజనేయ స్వామి దర్శనం ఎంతో ఆనందం, ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. కరీంనగర్‌కు వచ్చిన ప్రతిసారి తప్పకుండా స్వామిని దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పారు. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తికావడంతో టీమ్ సభ్యులంతా కలిసి స్వామి ఆశీస్సులు తీసుకున్నామని వెల్లడించారు.‘లీసా’ సినిమా ఎంతో బాగా వచ్చిందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత చందు, సహ నిర్మాత, డీఓపీ సతీష్ రెడ్డి, శివ నాయుడు, పవన్ మహేష్, లక్ష్మణ్, పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
