కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీనటి అనన్య నాగళ్ల
నవగీతం ,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని శనివారం సినీనటి అనన్య నాగళ్ల దర్శించుకున్నారు. ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమెతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనన్య నాగళ్ల మాట్లాడుతూ...కొండగట్టు అంజనేయ స్వామి దర్శనం ఎంతో ఆనందం, ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. కరీంనగర్‌కు వచ్చిన ప్రతిసారి తప్పకుండా స్వామిని దర్శించుకోవడం తనకు అలవాటని చెప్పారు. సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తికావడంతో...