నవగీతం,కొడిమ్యాల
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు సమర్పించిన వస్తువులను వేలం వేయగా గణనీయమైన ఆదాయం లభించింది. వివరాల ప్రకారం, కొబ్బరికాయల ద్వారా రూ.42,000 ఆదాయం వచ్చింది. పుష్పమాలల వేలం ద్వారా రూ.5,05,000 సమకూరింది. బియ్యాన్ని కిలోకు రూ.17 చొప్పున, గంటలను కిలోకు రూ.765 చొప్పున, ఎండుకొబ్బరికాయలను కిలోకు రూ.130 చొప్పున విక్రయించారు. అలాగే ఖాళీ నూనె డబ్బాలను ఒక్కోటికి రూ.21 చొప్పున వేలం వేశారు.ఈ వేలం ప్రక్రియలో ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి, ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఏసీ కార్యాలయం ఇన్స్పెక్టర్ రాజమౌళి, చెక్కిళ్ల అశోక్, రమేశ్వర్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.