నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తితో గోదావరి ఖనికీ చెందిన భక్త దంపతులు శ్రీకాంత్–లత భక్తి భావంతో ఈ గజవాహనాన్ని అందజేశారు.సుమారు రూ.80,000 విలువైన ఈ గజవాహనాన్ని స్వామివారి సేవల కోసం ప్రత్యేకంగా తయారు చేసి ఆలయానికి అందించారు. సోమవారం సాయంత్రం ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనారెడ్డికి భక్తులు అధికారికంగా అప్పగించారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, ప్రత్యేక పూజల సందర్భంగా స్వామివారి సేవలో ఈ గజవాహనం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు స్థానాచారి కపిందర్, ఆలయ ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.భక్తులు సమర్పించిన ఈ విరాళాన్ని ఆలయ అధికారులు అభినందిస్తూ, వారికి స్వామివారి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.