కొండగట్టు అంజన్న క్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో మే 11, 12, 13 తేదీలలో నిర్వహించనున్న పెద్ద జయంతి ఉత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి అధికారులకు ఆదేశించారు.సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున తాగునీటి సదుపాయం, క్యూ లైన్‌ల ఏర్పాటు, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, ప్రసాదం పంపిణీ వంటి అంశాల్లో...