కొండగట్టు అంజన్న దేవాలయానికి అరుదైన గౌరవం!
నవగీతం,జగిత్యాల ప్రతినిధి: తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరు ఉన్న జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలను పరిచయం చేస్తూ నీతీ ఆయోగ్ రూపొందించి నదివ్య భారత్ పుస్తకం లో ఈ క్షేత్రానికి ప్రత్యేక స్థానం లభించడం విశేషం. దేశంలోని పలు రాష్ట్రాల ఆధ్యా త్మిక, సాంస్కృతిక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను ఒకేచోట సమగ్రంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకా న్ని రూపొందించారు. దేశ...