navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 2:34 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు అంజన్న నిత్యాన్నదాన సత్రానికి రూ.1 లక్ష విరాళం

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రానికి భక్తులు భక్తిశ్రద్ధలతో విరాళాలు సమర్పిస్తూ సేవా కార్యక్రమానికి తోడ్పడుతున్నారు. ఈ సందర్భంగా హన్మకొండకు చెందిన కె. విక్రమ్ కుమార్–కీర్తన దంపతులు స్వామివారిని దర్శించుకుని, భక్తులకు నిత్య అన్నదానం నిర్వహణ కోసం రూ.1 లక్ష విరాళాన్ని సమర్పించారు.ఈ విరాళాన్ని ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఏఈఓ) హరిహర్నాథ్‌కు అందజేసి, సంబంధిత రశీదును స్వీకరించారు. అనంతరం దంపతులు అంజన్న స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదోక్తంగా ఆశీర్వచనం చేసి, శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.