navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:10 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బలుమురి వెంకట్  ప్రత్యేక పూజలు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బలుమురి వెంకట్ నర్సింగరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు వేదోక్త స్వస్తి స్వాగతం పలికారు.అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి వేదోక్త ఆశీర్వచనం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి ఎమ్మెల్సీకి శాలువా కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ తూము శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.