navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 10:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొడిమ్యాల తాసిల్దార్ గా నరేష్ బాధ్యతలు స్వీకరణ

నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:

కోడిమ్యాల తాసిల్దార్ గా డి. నరేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి. నరేష్‌ను కోడిమ్యాల తహసీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు.పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు