నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచించారు.మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు , ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. చివరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు, తప్ప, తాలు పేరుతో కోతలు విధించేవారని కృష్ణరావు అన్నారు. 2023 లో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఏలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి , ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, మామిడి లక్ష్మారెడ్డి ,దానరేకుల సంతోష్ , మిద్దె అంజయ్య ,అంతడుపుల గంగాధర్ , జక్కుల కొమురయ్య, సిరికొండ గంగారెడ్డి మహిళా మండలి వీవో భారతి , మహిళా సంఘాల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు, రైతులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
