కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి : జువ్వాడి కృష్ణారావు
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచించారు.మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు , ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు. చివరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి...