కోట బురుజుల స్థలాల విక్రాయాలపై అప్రమత్తంగా ఉండాలి
నకిలీ దస్తావేజులతో రియల్టర్ల మోసాలు అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక హెచ్చరిక నవగీతం కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని చారిత్రక కోట బురుజుల స్థలాలను నకిలీ దస్తావేజులతో విక్రయించేందుకు కొందరు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. కోట బురుజుల...