కోరుట్లలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
రెపరెపలాడిన కాషాయ జెండా నవగీతం,కోరుట్ల ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోరుట్ల పట్టణంలో పార్టీ శ్రేణులు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద మరియు ముఖ్య కూడళ్లలో బిజెపి పట్టణ కౌన్సిలర్లు మరియు సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు మాట్లాడుతూ, అతి తక్కువ కాలంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి అవతరించిందని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రతి కార్యకర్త...