navageetam.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 11:44 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కోరుట్ల పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ గుజ్జేటి వెంకటేష్ కి అరుదైన గౌరవం

ఐఐటీ మద్రాస్ ఎడ్యుకార్నివాల్-2026కు ఎంపిక

నవగీతం ,కోరుట్ల ప్రతినిధి :

ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఎడ్యుకార్నివాల్ – 2026’లో పాల్గొనే అరుదైన అవకాశం తమ పాఠశాలకు లభించిందని కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ గుజ్జేటి వెంకటేష్ గర్వంగా ప్రకటించారు. ఈ అంతర్జాతీయ స్థాయి వేదికపై “బిల్డింగ్ డ్రీమ్ స్కూల్ టీమ్” అనే ప్రధానాంశంపై చర్చించనున్నామని, విద్యారంగంలో వస్తున్న వినూత్న మార్పులను నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు మన పాఠశాలకు సరికొత్త ఆలోచనలను పరిచయం చేయడానికి ఇదొక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయి విద్యావేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమంలో తమ పాఠశాల భాగస్వామ్యం కావడం విద్యార్థుల భవిష్యత్తుకు మరియు పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.