కోరుట్ల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యునిగా శ్రీనివాస్ గుండోజి ఎంపిక

నవగీతం,కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్ కో-ఆప్షన్ సభ్యునిగా శ్రీనివాస్ గుండోజి ఎన్నికయ్యారు.మంగళవారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక జ్ఞానం, అనుభవం కలిగిన వ్యక్తుల విభాగం కింద ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆయనను సభ్యునిగా ఎంపిక చేశారు.మున్సిపల్ కమిషనర్ జి. రవీందర్, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత , వైస్ చైర్మన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్...