navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 12:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్షయ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం :జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వామ్యం కావాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ మొబైల్ ఎక్స్-రే యంత్రంతో క్షయ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నూతన సాంకేతికతతో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్స్-రే పరీక్షలు చేసి తక్షణమే క్షయ వ్యాధిని గుర్తిస్తున్నామని తెలిపారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.శిబిరంలో మొత్తం 68 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.కార్యక్రమంలో వైద్యాధికారులు నరేష్, పరమేశ్వరి, సీహెచ్‌ఓ రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్లు వెంకటనర్సమ్మ, అలివేలు, ఎస్టీఎస్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ వికాస్, నర్సింగ్ అధికారులు లావణ్య, శ్రీజ, ఫార్మసీ అధికారి శ్రీలత, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎక్స్ రే  పరీక్షల నిర్వహిస్తున్న వైద్యాధికారి