navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 2:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మల్లాపూర్ మండల కేంద్రం పీఎస్సీలో క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరము నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి  ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సలహాలను సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, చాతిలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి తగు పరీక్షలు చేయించుకొని మందులు వాడాల్సిందిగా సూచించారు.ఈ వైద్య శిబిరంలో మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలు 92 మందికి  ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశామని డాక్టర్ వాహిని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వాహిని , జిల్లా కోఆర్డినేటర్ కట్ట హరీష్, కమిటీ హెల్త్ ఆర్గనైజర్ లింగ రామ్మోహన్, టిబి సూపర్వైజర్ ఆంజనేయులు, ల్యాబ్ టెక్నీషియన్ ఉమాదేవి స్టాఫ్ సుమలత, ఫార్మసిస్ట్ మహేశ్వరి హెల్త్ అసిస్టెంట్, శ్రీనివాస్ ,విక్రమ్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు