క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మల్లాపూర్ మండల కేంద్రం పీఎస్సీలో క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరము నిర్వహించారు.ఈ వైద్య శిబిరానికి  ముఖ్యఅతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ వ్యాధి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సలహాలను సూచించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, చాతిలో పట్టేసినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో...