navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 5:28 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఖుతుబోద్దీన్,అజీమ్ కుటుంబాలకు డాక్టర్ రఘు పరామర్శ

నవగీతం,మెట్‌పల్లి ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా మరియు మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ ల తల్లి మృతి పట్ల నిత్య సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు సంతాపం వ్యక్తం చేశారు.గత రెండు రోజుల క్రితం వీరి తల్లి మరణించగా, సోమవారం డాక్టర్ రఘు అల్లాడి ప్రవీణ్ నల్ల వెంకట్ లు వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్న వారు, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు.