navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 9:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గడి పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

బడిబాట కరపత్రం ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి కె రాము

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్లలోని ప్రాథమిక పాఠశాల (యస్ ఆర్ ఎస్ పి) క్యాంప్, గడి కల్లూరు రోడ్ లో ఉత్సాహభరితమైన పాఠశాల వార్షికోత్సవం బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు గడి పాఠశాల ప్రగతిలో ముఖ్యమైన స్థానముందని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అంశాలను కొనియాడారు. రాబోయే విద్య సంవత్సరంలో కొత్త మెనూకు ప్రకారం భోజనం రుచికరంగా ఉండేందుకు చర్యలు ఉంటాయని అన్నారు. బడి బాట కార్యక్రమంలో కొత్త విద్యార్థులను ఎక్కువగా నమోదు చేయాలని కోరారు. రాబోయే విద్య సంవత్సరం కొరకు బడి బాట కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నునావత్ రాజు, మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ జి. రవీందర్, మండల విద్యాధికారి జి. నరేశం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పి. మంగ, వి. గంగాధర్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, సునీత రాజశేఖర్ కౌన్సిలర్, వక్త గుంటుకుల రమేష్, జి గంగాధర్ నాయక్ రేలా రే రేలా సింగర్,ఉపాధ్యాయులు అబ్దుల్ రహూఫ్, పూర్ణచందర్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, భవాని సహా విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.