గడి పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

బడిబాట కరపత్రం ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి కె రాము నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్లలోని ప్రాథమిక పాఠశాల (యస్ ఆర్ ఎస్ పి) క్యాంప్, గడి కల్లూరు రోడ్ లో ఉత్సాహభరితమైన పాఠశాల వార్షికోత్సవం బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు గడి పాఠశాల ప్రగతిలో ముఖ్యమైన స్థానముందని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అంశాలను కొనియాడారు. రాబోయే విద్య సంవత్సరంలో కొత్త మెనూకు ప్రకారం భోజనం...