navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 5:46 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గడి స్థలాలు కాపాడాలి, విఎల్టీలు రద్దు చేయించాలని కోరుతూ బిజేపి కౌన్సిలర్లతో సంతకాల సేకరణ

నవగీతం,కోరుట్ల ప్రతినిధి:

కోరుట్ల గడి బురుజుల స్థలాలు కాపాడాలని నకిలీ దస్తావేజులతో ఇంటి నెంబర్ 6-4-228 లో ఏకకాలంలో పరిధికి మించి ముప్పై సంవత్సరాల పన్నును వసూలు చేయడమే కాకుండా పేరు మార్పిడి తో పాటు 5800 గజాల కు విఎల్టీలు వేసిన కమీషనర్ పై చర్యలు తీసుకోవాలని వాటిని రద్దు చేయించాలని కోరుతూ ఐదు రోజుల నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ ప్రారంభించిన అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు మొదటి రోజు బిజెపి కౌన్సిలర్లతో సంతకాల సేకరణ చేశారు.ఈసందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు తిరుమల వాసు, కలాల రాధ సాయి చంద్, రుద్ర సుజాత శ్రీనివాస్, జి శ్రీకాంత్, సొరపాక రమేష్ లను కలిసి మున్సిపల్ కౌన్సిల్ లో మెజారిటీ కౌన్సిలర్ లతో విఎల్టీలు రద్దు చేయించాలనే సంకల్పంతో సంతకాల సేకరణ ప్రారంభించినట్లు తెలుపగా దానికి బిజేపి కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సంతాకాలు చేయడమే కాకుండా సిడిఎంఎ కు నేరుగా కలిసి పిర్యాదు చేస్తామని తెలిపిన బిజేపి కౌన్సిలర్ లకు ఈసందర్భంగా ధన్యావాదాలు తెలిపారు.ఈ సంతకాల సేకరణ లో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేష్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్ తదితరులు పాల్గొన్నారు.