గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సంబురాలు

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం పూర్తి చేసుకోనున్న తోటివిద్యార్ధినులులకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్ధినులు ఘనంగా వీడ్కోలు పలికారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. గునుక శ్రీలత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ...ఈ రోజు ఈ సమావేశాన్ని చూస్తుంటే ఈ గడిచిన రోజులు మళ్ళీ రావని, ఈ డిగ్రీ కోర్సు జీవితంలో కీలకమని,ఏ ఉద్యోగంలో గాని లేదా ఇష్టమైన రంగంలోగాని స్థిరపడాలంటే డిగ్రీ తప్పనిసరి అని అయితే డిగ్రీతోనే కాకుండా పి.జి లో...