navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 1:27 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గోమాత సేవలో నిత్యసాయి ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘు

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి:

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు మెట్‌పల్లి పట్టణంలోని చెన్నకేశవనాథ స్వామి ఆలయం వద్ద ఉన్న గోమాతలకు పండ్లను తినిపిస్తూ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతలను ప్రేమతో సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. గోవులు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని, గోమాతను పూజించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని డాక్టర్ రఘు అన్నారు.