తాసిల్దార్ కి వినతిపత్రం అందజేసిన హిందూ ఐక్యవేదిక నాయకులు
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సాధుసంతుల పిలుపుమేరకు గోసంతతిని కాపాడాలని అందుకుగాను గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఈ ఉద్యమం చేపట్టడం జరిగిందని గో ఆరాధన దినోత్సవం సందర్భంగా సోమవారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రికి కలెక్టర్లకు,మండలం తాసిల్దారులకు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోవును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు