గ్రామాలకు వస్తా‌.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అడ్లూరి

కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు....