navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 2:58 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామీణులకు ఉచిత నేత్ర శిబిరం- లయన్స్ క్లబ్ సేవలు ఆమోగం..

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు లయన్ చిదుర సురేష్ (పీడీజీ) వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ వ్యవహరించారు.ఈ సందర్భంగా లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ శిబిరం లక్ష్యమని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల సమాజ సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తోందని లయన్స్ క్లబ్ సేవలు ఆమోగమనిఆమె పేర్కొన్నారు.ఈ శిబిరంలో కంటి సంబంధిత సమస్యలపై ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు.అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని వారు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఓరుగల అరుణ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, ఉప సర్పంచ్ బత్తుల ప్రదీప్, వార్డ్ మెంబర్స్ నంది మహిపాల్, ఓరుగల అంజమ్మ, గండ్ర మంగ, బొమ్మన సరోజన , కొండ శిరీష, వడ్లగట్ల శంకర్ లయన్ క్లబ్ జగిత్యాల అధ్యక్షులు, గుండేటి గంగాధర్ లియోన్ క్లబ్ జగిత్యాల ప్రధాన కార్యదర్శి, సామల శ్రీహరి కోశాధికారి లయన్ క్లబ్ జగిత్యాల, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.