navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 5:59 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో  చలివేంద్రాలు  ఏర్పాటు

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ప్రజలు, బాటసారులు, ప్రయాణికులు అల్లాడిపోతుంటారు. దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము అని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ అన్నారు.అంబేద్కర్ కూడలి వద్ద మరియు కొత్త బస్ స్టాండ్ లో రెండు చలి వేంద్రములు పాలక వర్గం ఆధ్వర్యంలో ప్రారంభించారు.వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల ద్రాహార్తి  తీర్చడానికి చలివేంద్రాల ఏర్పాట్లు చేసిన గ్రామ పంచాయతీ సేవా దృక్పథాన్ని పలువురు అభినందించారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సోమరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి, బిల్ కలెక్టర్ జగన్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, కొంపెల్లి రాకేష్, అరికుప్పల చిన్న రాజం, ఏనుగు లక్ష్మి, కదుర్క లక్ష్మి -రాజేందర్, శనిగారపు నరేష్, మహమ్మద్ షబ్బీర్, కాషవత్తుల గంగా రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఉయ్యాల లక్ష్మణ్, ముత్యాల గంగరాజాం సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.