లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:
కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు యకీన్ పూర్‌లో సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశ వేడుక అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ శిరీష శేఖర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆదేశాల మేరకు.. గృహ ప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు బత్తుల నిఖిల్ – రాజమణి దంపతులకు కౌన్సిలర్ శిరీష శేఖర్ నూతన వస్త్రాలను (చీర, పంచె) కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులందరూ తమ ఇంటి నిర్మాణాలను నిర్ణీత గడువులోగా, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ క్రమంలో లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉరుమడ్ల వెంకటి, మ్యాదరి లక్ష్మణ్, ఇల్లెందుల శ్రీధర్, బన్న రాజేష్, బైర స్వప్నకర్, బద్ది సుమన్ తదితరులు పాల్గొన్నారు.
