ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవగీతం,కోరుట్ల ప్రతినిధి: బిఆర్ఎస్ పార్టీ దినోత్సవం సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెండా  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పార్టీని స్థాపించి అన్ని వర్గాలను ఏకం చేసి , అలుపెరుగని పోరాటం చేసి,ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దేనని,ఇప్పటికి ఎప్పటికి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ రే రక్ష అని అన్నారు.ఈ...