వెంకట్రావు పేట్ లో నివాళులర్పిస్తున్న పంచాయతీ పాలకవర్గం
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ లో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కనుముల వెంకటేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్ లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు అని తెలియజేసారు.ఈ కార్యక్రమం సర్పంచ్ కానుముల వెంకటేష్ ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి. కారోబార్ జోగులా నరేష్,వార్డ్ సభ్యులు సార్ల రాజేశ్వర్, జక్కని మల్లేష్, అంగన్వాడీ టీచర్స్ తోట జమున.యాదగిరి సంధ్య,వేముల పద్మ. తదితరులు పాల్గొన్నారు.
గుండంపల్లి లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో భారత మాజీ ఉపప్రధాని,స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల ఆశాకిరణం డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య హృదయపూర్వకంగా, ప్రగాఢమైన నివాళులు అర్పించారు.
సామాజిక సమానత్వం కోసం అచంచల సంకల్పంతో దళితులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన నిరంతర పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తిదాయకం. ఆయన ప్రతిష్ఠించిన న్యాయం, సమానత్వం,సేవ అనే మహోన్నత విలువలు నేటికీ మన పథాన్ని ప్రకాశింపజేస్తున్నాయి అని కొనియాడారు.ఆయన ఆశయాల సాధనలో సమాన హక్కులు,సామాజిక న్యాయం పరిపుష్టి చెందేలా మనమందరం ఐక్యంగా, సంకల్పబద్ధంగా ముందడుగు వేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, వ్యవసాయ చైర్మన్ పుష్పలత నర్సయ్య,ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్,కార్యదర్శి నారాయణ రెడ్డి, గున్నాల విజయ్, శ్రీశైలం మల్లేశం, దానరేకుల నరేష్, మారుతి, లక్ష్మీనారాయణ, రాజా మల్లయ్య, శ్రీనివాస్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
