navageetam.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 11:19 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి

నవగీతం, మల్లాపూర్

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ మండలం పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం బిజెపి పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… భారతీయ సామాజిక లక్ష్యాల కోసం స్థాపించబడిన పార్టీ బీజేపీ అని ఉన్నతమైన ఆశయాల సాధన కోసం పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన దయాల్ ఉపాధ్యాయ త్యాగాలను స్మరించుకుంటూ, నాటి నుంచి నేటి వరకు ఆదర్శవంతమైన నాయకుల జీవితాలను, నేడు మార్గదర్శనం చేస్తున్న నాయకత్వ లక్ష్యాలను మరోసారి నెమరు వేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల ఉపాధ్యక్షులు లవంగ శివ,ప్రధాన కార్యదర్శి కాంతయ్య చారి ,సీనియర్ నాయకులు డబ్బా రాజారాము,గడ్డం నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ముస్కిరీ రాజ్ కుమార్, బూతు అధ్యక్షులు ఇల్లెందుల మనోజ్ కుమార్,ఎర్ర రాజు, రాజేందర్,భుక్య రాజశేఖర్ అడ్డగట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేటలో బిజెపి జెండా ఆవిష్కరించిన నాయకులు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని వెంకట్రావుపెట్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జండా ఎగరవేసారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ.. స్థాపకులు, దేశ సేవే ధర్మంగా ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న బీజేపీ ప్రతి కార్యకర్త కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భారతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయాణం మరింత విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్, మండల కార్యవర్గ సభ్యులు పన్నల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బియ్యం సురేష్, శ్రీహరి ,శ్రీనివాస్, తుక్కరెడ్డి, తిరుపతి, మహేష్, అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.