navageetam.com
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:07 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా వాసవి మాత  జయంతి వేడుకలు

మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నవగీతం మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి పట్టణంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, హోమం మహిళల చే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని అధికారిక పండుగ జాబితాలో చేర్చినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్  మైలారపు లింబాద్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆర్యవైశ్య ప్రతినిధులు  పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్  ఓంకార్ నవీన్ 3వ వార్డు కౌన్సిలర్ బత్తుల నరేష్ 10వ వార్డు కౌన్సిలర్ మునుగొండ నరేష్ 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్ 20వ వార్డు కౌన్సిలర్ మసూల ప్రవీణ్ 21వ వార్డు కౌన్సిలర్ అజీమ్ , నాయకులు గజం రవికాంత్ , రైసోద్దిన్  ఆర్య వైశ్య సంఘ సభ్యులు మహిళలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.