25 సంవత్సరాల తర్వాత శారద విద్యాలయం పూర్వ విద్యార్థుల కలయిక
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని శారదా విద్యా నిలయం పాఠశాలలో 1999–2000 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం హర్షోల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ కాలం నాటి సహపాఠులు, ఉపాధ్యాయులు, మరియు పాఠశాల యాజమాన్యం అండ్ హెడ్మాస్టర్ శ్రీ పునుగోటి నీరజాకుమారి రంగారావు పాల్గొని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాస కాలంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, గురువుల మార్గదర్శకత తమ జీవితాల్లో ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. దాదాపు 24 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దీనస్థితిలో మరియు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ లో ఉన్న తమ సమాచారం విద్యార్థులకు తమవంతు సహకారం అందించాలని పూర్వ విద్యార్థులు సంకల్పం వ్యక్తం చేశారు.ఈ సమ్మేళనం స్నేహబంధాలను మరింత బలపరిచే వేదికగా నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.