జనగణన–2027 ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలి

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: రాబోయే జనగణన–2027 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఎంపికైన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు శుక్రవారం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని, ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు సులభమవుతుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.శిక్షణలో భాగంగా ఇంటింటి వివరాల సేకరణ విధానం, డిజిటల్...