జనగణన–2027 ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలి – జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రాబోయే జనగణన–2027 (Census-2027) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన ఎన్యూమరేటర్లు (Enumerators) మరియు సూపర్వైజర్లకు శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి కీలకమని, ఖచ్చితమైన గణాంకాలు సేకరించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు సులభమవుతుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.శిక్షణలో భాగంగా ఇంటింటి...