navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 9:21 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జనాభా లెక్కల స్వీయ గణన పై అవగాహన

నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:

దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన – 2027లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య అన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఏప్రిల్ 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జనగణన చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం చేపట్టిన సెన్సెస్ 2027లో భాగంగా జనాభా లెక్కల స్వీయ గణనకు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించి ఎన్యూమారేటర్లకు వివరాలు అందించాలని సర్పంచ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.గ్రామ ప్రజలకు సూపర్వైజర్ బందరికంటి శ్రీనివాస్ గ్రామ ప్రజలు జనాభా లెక్కల స్వీయ గణన కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, సరైన వివరాలు తెలిపి నమోదు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య నరేష్ మల్లేష్ బాపురెడ్డి పాల్గొన్నారు.