navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:52 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జాగ్జీవన్ రామ్ స్పూర్తితో ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు

మేడిపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మాదం వినోద్ కుమార్

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో భారత తొలి ఉప ప్రధాని జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మాదం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జాగ్జీవన్ రామ్ స్పూర్తితో నే ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. జగ్జీవన్ రామ్ రక్షణ,వ్యవసాయ ,కార్మిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతల్లో కొనసాగిన జాగ్జీవన్ రామ్ స్వాతంత్రానంతరం స్వయంపాలనలో దేశ ప్రగతిలో పాలుపనుచుకున్న గొప్ప వ్యక్తి అని,ఆయన స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వ పాలనలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.దళిత,బహుజన వర్గాలకు ఆర్థిక,రాజకీయాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జాగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుయ్య అంజన్న, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి ప్రణయ్, వార్డు సభ్యులు నరేష్ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సంపత్ , శ్యామ్యల్ శేఖర్ సంజీవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.