నవగీతం,కోరుట్ల ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సీటెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో కోరుట్ల పట్టణానికి చెందిన గెల్లె మేఘమాల ప్రతిభ చాటారు. పట్టణ నివాసి గెల్లె గంగాధర్ కుమార్తె అయిన ఆమె, మొత్తం150 మార్కులకు గాను 86 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో క్వాలిఫై అయ్యారు. సొంతంగా శ్రమించి,మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతనం నుండే ఉపాధ్యాయ వృత్తిని లక్ష్యంగా ఎంచుకున్న మేఘమాల, ఇప్పుడు ఆ దిశగా విజయం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు,మిత్రులు ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు.