జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం

శుభాకాంక్షలు తెలిపిన అడువాల జ్యోతి లక్ష్మణ్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సంగనభట్ల దినేష్‌కు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని సుమంగళి గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొని దినేష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా అడువాల జ్యోతి మాట్లాడుతూ.. దినేష్ నాయకత్వంలో జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రంథాలయాలు సమాజానికి జ్ఞాన నిలయాలుగా నిలవాలని, విద్యార్థులు,...