నవగీతం , కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల పట్టణానికి చెందిన 27వ వార్డు మాజీ కౌన్సిలర్, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ కో-ఆప్షన్ సభ్యులు గుండోజి శ్రీనివాస్ శుక్రవారం టిపిసిసి రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం పలు రాజకీయ, సామాజిక విషయాలపై చర్చించగా, జువ్వాడి కృష్ణారావు శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చింతకింది రాంప్రసాద్, గుండోజి సత్యప్రసాద్, బర్ల ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.