నవగీతం ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండా, తిమ్మాపూర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది చేరినట్లు టిఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, ఉప సర్పంచ్ ముక్కెర సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, లక్పత్ రెడ్డి అంజయ్య అశోక్ రాజేందర్ రమేష్ రాజేష్ భూమేష్ తదితరులు పాల్గొన్నారు
