ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం

మేడిపల్లి ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి నవగీతం,కోరుట్ల ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఆరైవ్ ఏ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ట్రాపిక్ నియమాలు,రోడ్డు భద్రతా నిబంధనల గురించి అవగాహన కల్పించారు.అనంతరం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం,మద్యం సేవించడం, మొబైల్ ఫోన్ వినియోగం,ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటి...